Monday, January 13, 2025

భావోద్వేగాలతో బరువైన పాత్ర నాది..

- Advertisement -
- Advertisement -

Sobhita Dhulipala about Major Movie

యంగ్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ’మేజర్’లో కీలక పాత్ర పోషించిన నటి శోభితా ధూళిపాళ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో ప్రమోద అనే పాత్రలో కనిపిస్తా. సినిమాలో ఒక పక్క సందీప్ జీవితం చూపిస్తూ.. మరో పక్క 26/11 దాడులు, తాజ్ సంఘటని సమాంతరంగా చూపిస్తారు. నేను 26/11 దాడిలో బందీగా కనిపిస్తా. భయం, ఏడుపు, ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ .. ఇలా బోలెడు కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. భావోద్వేగాలతో చాలా బరువైన పాత్ర నాది. ఇక ఈ సినిమా కోసం అడివి శేష్ చాలా కష్ట పడ్డారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మొదటిసారి బయట ఈ సినిమా చేశారు. ఇది మాకు గొప్ప ఎనర్జీ నిచ్చింది” అని అన్నారు.

Sobhita Dhulipala about Major Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News