Sunday, December 22, 2024

హాలీవుడ్ మూవీలో శోభిత ధూళిపాళ

- Advertisement -
- Advertisement -

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ అంచెలంచెలుగా ఎదుగుతూ హాలీవుడ్ మూవీలో అవకాశం దక్కించుకున్నారు. ఆమె నటించిన మంకీ మ్యాన్ మూవీ తాజాగా విడుదలై, మంచి టాక్  రాబడుతోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు కూడా. ఆయన ఇందులో హీరోగా కూడా నటించారు.

2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకున్న శోభిత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత అనురాగ్ కాశ్యప్ మూవీ రామన్ రాఘవ్ తో బాలీవుడ్ మూవీలకు శ్రీకారం చుట్టారు. ఆమె నటించిన మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లకు చక్కటి పేరు వచ్చింది. తమిళ, మలయాళ సినిమాల్లోనూ శోభిత నటించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నయిన్ సెల్వన్ మూవీలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.

‘మంకీ మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా శోభిత ‘న్యూయార్క్ టైమ్స్’ తో మాట్లాడుతూ దేవ్ పటేల్ తో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందిన మంకీ మ్యాన్ లో రచయిత, నిర్మాత, దర్శకుడిగా దేవ్ బహుముఖ ప్రతిభ కనబరిచారని  కొనియాడారు. మంకీ మ్యాన్ చిత్రంలో శోభిత కాల్ గర్ల్ గా నటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News