Friday, December 20, 2024

డిసెంబర్ 4న నాగచైతన్య-శోభిత పెళ్లి.. వెడ్డింగ్ కార్డు వైరల్

- Advertisement -
- Advertisement -

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాళను ఆయన వివాహం చేసుకుంటున్నారు. గత నెలలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమైనట్లు తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభితా సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో నాగ చైతన్య-శోభిత వివాహం  చేసుకోబోతున్నారు.

తాజాగా వీరి వెడ్డింగ్ కార్డు నెట్టింట చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 4వ తేదీన వీరి పెళ్లి చేసుకోబోతున్నట్లు అందులో ఉంది. వరుడు, వధువు పేర్లతో పాటు వారి కుటుంబ వివరాలు కూడా ఉన్నాయి. ఈ వెడ్డింగ్ కార్డుతో పాటు ఒక బుట్టను ఇస్తూ అతిథులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బుట్టలో ఆహార ప్యాకెట్లు, బట్టలు, పువ్వులతో సహా పలు వస్తువులు కనిపిస్తున్నాయి. అయితే వెడ్డింగ్ కార్డు, పెళ్లి వేదికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, చైతన్య-శోభితా పెళ్లి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది. వెడ్డింగ్ కార్డులో మాత్రం వేదికను వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News