- Advertisement -
యువసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా నాగచైతన్యను ఉద్దేశిస్తూ ఆయన భార్య, నటి శోభిత ధూళిపాళ్ల ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అని శోభిత సరదాగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తండేల్ సినిమా కోసం నాగచైతన్య చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్‌లోనే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 4న వీరి వివాహమైన సంగతి తెలిసిందే.
కాగా.. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బన్ని వాసు భారీ స్థాయిలో నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ‘తండేల్’ మూవీ భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
- Advertisement -