Monday, December 23, 2024

నూతన వేసవి కలెక్షన్‌ 2023ను విడుదల చేసిన సోచ్‌..

- Advertisement -
- Advertisement -

దేశంలో అతిపెద్ద అకేషన్‌, ఈవెనింగ్‌ వేర్‌ బ్రాండ్‌, సోచ్‌ తమ తాజా స్ర్పింగ్‌సమ్మర్‌ కలెక్షన్‌ 2023ను విడుదల చేసింది. సోచ్‌ విడుదల చేసిన ఈ నూతన కలెక్షన్‌కు సంప్రదాయ భారతీయ కళలు, చేతిపనులు స్ఫూర్తి. గుజరాత్‌లోని అతి క్లిష్టమైన మ్యురల్‌ క్రాఫ్ట్స్‌ మొదలు, వినూత్నమైన నేత పద్ధతి ఇకత్‌ వరకూ ఈ కలెక్షన్‌ విస్తృత శ్రేణి కళారూపాలకు నివాళులర్పిస్తుంది. కోలమ్‌ ఆర్ట్‌తో ఎంబ్రాయిడరీ, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో కనిపించే లిప్పన్‌ మ్యురల్‌ క్రాఫ్ట్‌ స్ఫూర్తితో మ్యూజ్‌ ఆఫ్‌ మిర్రర్స్‌, సంప్రదాయ ఇకత్‌ నేత స్ఫూర్తితో ఇకత్‌ ఇంప్రెషన్స్‌ కలెక్షన్‌ వీటిలో ఉన్నాయి.

సోచ్‌ స్ర్పింగ్‌ సమ్మర్‌ కలెక్షన్‌, ఈ సీజన్‌ స్ఫూర్తిని ఒడిసిపడుతుంది. ఈ కలెక్షన్‌లో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తాలు, టునిక్స్‌, కుర్తా సెట్లు, లెహంగాలు, కఫ్తాన్స్‌ ఉన్నాయి. ఈ వేసవి కలెక్షన్‌లో సంప్రదాయ ప్రింట్స్‌, అతి సున్నితమైన డిజైన్లు భాగంగా ఉంటాయి. ఈ సమ్మర్‌ కలెక్షన్‌ ప్రారంభ ధర 798 రూపాయలు కాగా, అన్ని సోచ్‌ ఔట్‌లెట్ల వద్ద, www.soch.comవద్ద లభ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News