Monday, January 20, 2025

కార్పొరేట్ కళాశాలల వల్లనే సామాజిక అసమానతలు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : సమాజంలో సామాజిక అసమానతలకు కారణమవుతున్న కార్పొరేట్ కళాశాలలను నిషేదించాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్కో కార్పొరేట్ విద్యా సంస్థల్లో రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వేముల రామకృష్ణ అధ్యక్షతన బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల రౌండ్ టేండ్ సమావేశం శనివారం జరిగింది. రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ కారణంగానే సామాజిక అసమానతలు పెరిగాయ ని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల కంటే బార్లు, వైన్స్ షాపులు పెరిగాయని యద్దేవా చేశారు.

కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికల ను ప్రభుత్వం నిషేదించడం వల్లనే బలహీన వర్గాల నుంచి నాయకత్వం తయారు కావడం లేదన్నారు. దోపిడి వర్గాల కుట్ర ఫలితంగానే విద్యార్థి సంఘం ఎన్నికలను రద్దు చేశారని ద్వజమెత్తారు. బిసి స్టడీ సర్కిల్స్‌కు రూ. 200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కళాశాల కోర్సులు చదివే బిసి విద్యార్థుల మొత్తం ఫీజులను రీఎంబర్స్‌మెంట్ స్కీములో పునరుద్దరించాలని కోరారు. బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు అత్యధికంగా ఉపయోగపడే విద్యా హక్కు చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలన్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గా నికి గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం వంటి కోర్సులకు కూడా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించాలన్నారు. జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను రూ. 1000 నుంచి రూ. 10 వేలకు పెంచాలన్నా రు. బిసి సంక్షేమ సంఘం జాతీయ వైస్ ఛైర్మన్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, బిసి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బిఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి సంజయ్‌తో పాటు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News