Tuesday, September 17, 2024

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ను సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని బిఆర్ఎస్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. ఆయన అరెస్టును బిఆర్ఎస్ నేతలు ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.

ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా? అని కేటీఆర్ నిలదీశారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారని విమర్శించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది మీ భ్రమే అవుతుందని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింతమంది పుట్టుకు వస్తారన్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News