Wednesday, January 22, 2025

ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిజిటల్ యుగంలో సోషల్ మీడియా తనదైన పాత్ర పోషిస్తున్నది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా సోషల్ మీడియా నయా ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రతి పార్టీ,వారి అభ్యర్థి సోషల్ టీం ఏర్పాటు చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పాడింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రచారంలో యాక్టివ్‌గా ఉండటానికి పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.ఓటర్లను ప్రభావితం చేయాడానికి క్రియేటివ్ కంటెంట్‌తో ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఒక పార్టీ అభ్యర్థి తన ప్రచారంలో భాగంగా ఒక గ్రామంలో వెళ్లి మాట్లాడితే, కేవలం ఆ గ్రామ ప్రజలే కాకుండా యూట్యూబ్,ఫేస్‌బుక్‌ల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా డిజిటల్ ప్రచారం సాగిస్తున్నారు.

అధికార పార్టీ అభ్యర్థులు తాము చేసిన అభివృద్ది,సంక్షేమ డాక్యూమెంటరీ రూపంలో ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షపార్టీల నేతలు తమ పార్టీ మ్యానిఫెస్టోను, తాను గెలిస్తే ఏం చేస్తానో సోషల్ మీడియా వేదిక ద్వారా పబ్లిసిటి చేస్తున్నారు. ఇది ఏలా ఉంటే తమ ప్రత్యర్థులు ఏమైనా మాట తూలిన, చేయరాని హవాభావాలు వ్యక్తపరిచిన నిమిషాల్లో ఆ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తు తిప్పుతున్నారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరాన్ని తీసుకవచ్చింది సోషల్ మీడియా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News