- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఒక మైనర్ బాలికపై ఆమె సోషల్ మీడియా ‘మిత్రుడు’ అత్యాచారం చేశాడని, ఆమె సాగర్‌పూర్ ప్రాంతంలోని డబ్రి మెట్రో స్టేషన్ సమీపంలో స్పృహలో లేని స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. బాలిక కథనం ప్రకారం, ఆమె మంగళవారం మెట్రో స్టేషన్ సమీపంలో కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను కొట్టారని, అక్కడికి నెట్టివేశారని పోలీసులు అంతకుముందు తెలిపారు. పోలీసులు నిందితుని నిర్బంధంలోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. అతను కూడా మైనరే. ‘తన సోషల్ మీడియా మిత్రుని కలుసుకోవాలని ఆమె నిశ్చయించినట్లు మాకు తెలిసింది. ఆ తరువాత ఆమెపై అత్యాచారం జరిగింది. ఆమె తన ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఒక రిక్షా ఎక్కింది. మెట్రో స్టేషన్ సమీపంలో స్పృహ కోల్పోయిన ఆమెకు స్వల్ప గాయాలు తగిలాయి’ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
- Advertisement -