అత్యంత త్వరితగతిన ప్రజల మధ్య అనుసంధానానికి సోషల్ మీడియా సాధనం అయింది. దీనితో వయస్సు, జాతీయత వంటి అడ్డంకులు తొలిగిపడుతున్నాయి. ఇదే క్రమంలో ఈ కమ్యూనికేషన్ టూల్స్ వల్ల మనిషిలో విపరీతమైన వికృత చేష్టలకు కూడా వీలేర్పడుతోంది. ఆన్‌లైన్ దూషణలు, ట్రోలింగ్స్ వంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని చంద్రచూడ్ తెలిపారు. ఇదే దశలో ఇప్పుడు ముందుకువస్తున్న ఎఐతో పరిస్థితి మరింత డోలాయమానం అవుతోంది. దీనితో మరింతగా దుర్వినియోగానికి, బెదిరింపులకు చివరికి వ్యక్తులను టార్గెట్ చేసుకుని హింసించేందుకు వీలేర్పడుతుంది. ఇటువంటి ప్రక్రియలతో సాగించే చేష్టల అడ్డుకట్ట కూడా ఇప్పుడు మన ముందున్న సవాలు అవుతోందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
Also Read: యాపిల్ నుంచి పరికరాలను కొన్న ఫాక్స్‌కాన్
ఇది రాబోయే తరానికి ముందుండే లక్షం అవుతుందన్నారు. ఇప్పుడు ఉన్నత విద్య పట్టాలు పుచ్చుకుని సమాజంలోకి వెళ్లే యువతకు తాను రెండు ప్రశ్నలు వేస్తున్నానని, వీటిని మీరు తరచితరచి చూసుకుంటారని ఆశిస్తున్నానని , ఇందులో ఒక్కటి మన ముందుకు వచ్చిన టెక్నాలజీ వల్ల ఎటువంటి ఫలితం కలుగుతోంది? రెండోది ఈ టెక్నాలజీతో మనకు ఏ విధమైన సౌలభ్యం ఏర్పడుతోందని చెప్పిన సిజెఐ విలువ అంటే తన దృష్టిలో యువత ఆలోచనలు, సృజనాత్మకతలు, వారి సాంకేతిక విజయాలు ఎంత డబ్బు గడిస్తాయనేది కాదని తెలిపారు. మన సాంకేతిక సృష్టితో మన సిద్ధాంతపరమైన విలువలు ఏ రీతిలో బలోపేతం అవుతున్నాయనేదే కీలకం అన్నారు. ప్రతిష్టాత్మక ఐఐటి మద్రాసు 60 ఏండ్ల స్నాతకోత్సవంలో మొత్తం 2571 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందారు. ఐఐటి మద్రాసు పాలక మండలి అధ్యక్షులు పవన్ గోయెంక మాట్లాడుతూ సంస్థ తరఫున పరిశోధనలకు ఇప్పుడు రూ వేయి కోట్ల వరకూ వెచ్చిస్తున్నట్లు తెలిపారు.