Wednesday, January 22, 2025

ఇరాక్‌లో సోషల్ మీడియా స్టార్ హత్య

- Advertisement -
- Advertisement -

బాగ్దాద్ : ఇరాక్‌లో సోషల్ మీడియా స్టార్‌గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్ లోని ఆమె ఇంటి వద్దే గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపారు. టిక్‌టాక్‌లో ఉమ్ ఫహాద్‌గా ప్రజాదరణ పొందిన ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తూర్పు బాగ్దాద్ లోని జయౌనా ప్రాంతం లోని ఆమె ఇంటివద్ద ఈ సంఘటన జరిగింది. బైక్‌మీద వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు.

ఇందుకు సంబంధించిన చిత్రాలు సిసిటివిల్లో రికార్డు అయ్యాయి. అయితే నిందితుడు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. గతంలో సఫాదీ చేసిన వీడియోలు వివాదాస్పదమయ్యాయి. నైతికత ఉల్లంఘన కింద ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. బయటకు వచ్చిన తరువాత పాప్ మ్యూజిక్‌కు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు తీయడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే టిక్‌టాక్ వీడియోలతో పేరు పొందిన నూర్ అల్‌సఫర్ అనే యువతి కూడా 2023లో హత్యకు గురయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News