సిఎం కెసిఆర్ నిర్ణయం కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగుల ఎదురుచూపు
సిపిఎస్‌ను రద్దు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలి
కెసిఆర్‌కు సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నో ఏళ్లుగా సిపిఎస్ విధానంతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు కెసిఆర్ న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్నామని, రాష్ట్రంలో రెండు లక్షలపైగా సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల అభ్యర్థనను ప్రభు త్వం పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ తీసుకునే నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు పే ర్కొన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర కాంట్రీబ్యాటరీ పెన్షన్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యం లో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘చలో హైదరాబాద్’, ‘పాత పెన్షన్ సాధన సా కార సభ’కు సుమారు లక్ష పైచిలుకు ఉద్యోగ, ఉ పాధ్యాయులు హాజరయ్యారు.
సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి కల్వ ల్ శ్రీకాంత్ కోశాధికారి నరేష్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు పాత పెన్షన్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ33 జిల్లా ల నుండి తరలివచ్చారు. ఈ సభకు నేషనల్ మూ మెంట్ ఫర్ ఓల్ పెన్షన్స్ స్కీం జాతీయ అధ్యక్షుడు విజయకుమార్ బంధు, పంజాబ్ సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖజిత్‌సింగ్, కర్ణాటక సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ్, ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ నాయకులు పల్లెల రామాంజనేయులు, మహారాష్ట్ర నుంచి విటే ష్ ఖండేల్కర్, ఝార్ఖండ్ నుంచి విక్రమ్‌సింగ్ చత్తీస్‌ఘడ్ నుంచి రాకేష్ సింగ్, తమిళనాడు నుంచి ఆరోగ్యదాస్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
84 లక్షల మంది ఎదురుచూపు: సిపిఎస్ జాతీయ అధ్యక్షుడు
సిపిఎస్ జాతీయ అధ్యక్షుడు విజయ్‌కుమార్ బంధు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ తెలంగాణలో తీసుకునే నిర్ణయంపై దేశంలోని 84 లక్షల ఉద్యో గ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని సిపిఎస్‌ను రద్దు చేసి మరోసారి దేశ్ కి నేత కావాలని ఆయన సూచించారు.
సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వంపై భారం పడదు: స్థితప్రజ్ఞ
ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తే ప్రభుత్వానికి నయా పైసా భారం ఉండదన్నారు. రూ.16,500 కోట్లు పెన్షన్ నిధి సమకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేస్తే, ఈ పెన్షన్ నిధిని తిరిగి రాష్ట్రాలకు కేంద్రం చెల్లిస్తుందన్నారు. సిపిఎస్ రద్దు చేయాలన్న నినాదంతో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని అక్టోబర్ 1వ తేదీన రాంలీల మైదానంలో సభ నిర్వహిస్తామన్నారు. కేంద్రం దిగివచ్చేలా కెసిఆర్ సిపిఎస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర సిపిఎస్ యూనియన్ అధ్యక్షుడు విటేష్ ఖండేల్కర్ మాట్లాడుతూ తెలంగాణలో సిపిఎస్ రద్దు చేస్తే మహారాష్ట్రలోని ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతుందని రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కెసిఆర్ ప్రభుత్వానికి ఉద్యోగులు మద్ధతు తెలుపుతారన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పకుండా పార్టీ పరమైన నిర్ణయం తీసుకొని పాత పెన్షన్‌ను తెలంగాణలో అమలు చేయాలని ఆయన కోరారు. జార్ఖండ్ అధ్యక్షుడు విక్రమ్ సింగ్ మాట్లాడుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్‌తో తెలంగాణ సిఎం కెసిఆర్‌తో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, హేమంత్‌సోరన్ కెసిఆర్‌తో పాత పెన్షన్ పునరుద్ధరణపై చర్చింప చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు పల్లెల రామాంజ నేయులు మాట్లాడుతూ ఇటీవల ఎపి ముఖ్యమంత్రి ప్రకటించిన జిపిఎస్ విధానానికి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా వ్యతిరేకమని పాత పెన్షన్ విధానమే ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, జ్యూడిషరీ జాతీ య అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, తపస్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి నవత్ సురేష్, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య, టిఆర్‌టిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమే ష్, సెక్రటరీ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు, ఎస్‌జిటి యూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, వెటర్నరీ ఫో రం అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, బ్లైండ్ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు.