Monday, December 23, 2024

సామాజిక సేవకురాలు గోల్కొండ స్వాతికి డాక్టరేట్ ప్రదానం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: దేశంలో మానవత్వాన్ని మించిన సహాయం ఏదీ లేదని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా (చికాగో) అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ షా, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎబిఎంకె వరప్రసాద్‌లు అన్నారు. ఈ మేరకు మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ్‌నగర్‌లొని బిఎం బిర్లా సైన్స్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సమాజానికి వివిధ రూపాల్లో సామాజిక సే వలు అందిస్తున్న తెలంగాణ సమతా మహిళా మండలి అధ్యక్షురాలు గోల్కొండ స్వాతికి డాక్టర్ రామకృష్ణ షా, డాక్టర్ ఎబిఎంకె వరప్రసాద్‌లు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసి, అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో శాంతి, స్వేచ్చ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారి సేవలను గుర్తించి, మనం ఫౌండేషన్ సంస్థ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం హర్షణీయమన్నారు.

అనంతరం సన్మాన గ్రహీత గో ల్కొండ స్వాతి మాట్లాడుతూ గత పదేళ్లుగా తెలంగాణ సమతా మహిళా మండలి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి , తన సేవలకు గుర్తి ంపుగా గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, మనం ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కార ం తన బాధ్యతలను మరింతగా పెంచిందని, భవిష్యత్‌లో సమతా మహిళా మండలి సారథ్యంలో సామాజిక సేవా కార్యక్రమా లను మరింతగా విస్తరిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు, మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు, జాతీయ ఛైర్మెన్, డాక్టర్ చక్రవ ర్తి, దేవీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎంఆర్ చౌదరి, సీనియర్ నటుడు మాణిక్, సినీనటులు బాలాజీ, నవ యువతరం ఏపీ కన్వీనర్ ఎం మేఘమాల, మనం ఫౌండేషన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శారద, ఎం ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News