హైదరాబాద్: సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం కొనసాగుతోంది. సిఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని, అందుకు బాధ్యులు పాలకులే అవుతారని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఊరుకు పోయినా సామాజికంగా ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే దళితులేనని, ఈ బాధలు పోవాలన్నారు. దళితులకు సామాజిక ఆర్థిక బాధలు తొలగి పోవాలంటే ఏం చేయాలో దశల వారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెసిఆర్ తెలియజేశారు. తాము కూడా పురోగమించగలం అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకెళ్లేందుకు ఏం చేయాలో సూచనలు చేయండన్నారు. పారదర్శక విధానాన్ని అమలు పరుద్దామని, నిధుల బాధ్యత నాదన్నారు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత మనందరం తీసుకుందామని వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఎంఐఎం పార్టీ, యాకుత్ పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత బొర్లకుంట, నాగర్ కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, రైతు బంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎమ్.ఎస్. ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు డి. రాజేశ్వర్ రావు, గోరటి వెంకన్న, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చంటి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె. మాణిక్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆలంపూర్ ఎమ్మెల్యే విఎం అబ్రహం, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్, ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ ఎంపి మంద జగన్నాథం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, టీఆరెఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కృషాంక్, శ్రీధర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, సిఎంవో అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, శ్రీమతి స్మితా సబర్వాల్, శేషాద్రి, శ్రీధర్ దేశ్ పాండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, బుద్దవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లే పల్లి లక్ష్మయ్య, ఎస్సీ కార్పోరేషన్ వైస్ చైర్మన్ మరియు ఎండి కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరక్టర్ ఉమా దేవి, జి.టి. వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.