Saturday, December 21, 2024

సమాజానికి పెరియార్ ఆలోచనా విధానం అవసరం

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: సమాజంలో కొనసాగుతున్న అంతరాలు, సామాజిక వివక్షతను రూపుమాపడానికి పెరియార్ ఆలోచనా విధా నం నేటికీ స్ఫూర్తిదాయకం అని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, డాక్టర్ బీఆర్ అంబే ద్కర్.. జాషువా.. పూలే.. పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం పెరియార్ రీడర్ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పెరియా ర్ లిటరే చర్ ఫౌండేషన్ అధ్యక్షులు బి. విల్సన్ అధ్యక్షత వహించగా, ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కె. శ్రీనివాస్, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాకులు గీతా రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కుల వ్యవస్థను చీల్చి చెండాడి, సమ సమాజ నిర్మా ణానికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుత సమాజం ఆధునికంగా అభివృద్ది చెందినప్పటికీ నేటికీ కులాల పేరు తో పేదలను వివక్షత గురి చేస్తుండటం హేయమైన చర్య అని అన్నారు. సామాజిక అసమానతలను తొలగిం చేందుకు పెరియార్ ఆలోచనలను ప్రజలు మరింత అవ గాహన చేసుకుని మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News