నాగ్ పూర్: జనాభా తగ్గుదల అనేది ఆందోళనకర అంశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. జనాభా క్షీణిస్తే సమాజం దానంతట అదే నశించిపోతుందన్నారు. నాగ్ పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన కుటుంబ ప్రాధాన్యత గురించి చెప్పారు. కుటుంబాలు సమాజంలో భాగమన్నారు.
‘‘జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1 కన్నా దిగువకు వెళ్తే…సమాజం నశిస్తుందన్నారు. దానిని ప్రత్యేకంగా ఎవరూ అంతం చేయాల్సిన అవసరం ఉండదన్నారు. భారత జనాభా విధానం కూడా జననాల రేటు 2.1 కన్నా తక్కువ ఉండకూదని చెబుతుందన్నారు. పైగా మన దేశానికి సంబంధించినంత వరకు ఈ రేటు 3 ఉండాలన్నారు.మన సమాజం మనుగడకు ఇది అవసరమన్నారు.
ప్రతి మహిళ 2.1 రేటులో పిల్లలని కంటేనే జనాభా భర్తీ జరుగుతుందన్నారు. 2.1 కి దరిదాపు రేటులో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీసియా ఉన్నాయన్నారు. 2.1 కన్నా తక్కువ రేటు కలిగిన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో, చైనా, జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయన్నారు.