హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆట విడుపు కోసం క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో దుర్మరణం చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మణికంఠ(26) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గత సంవత్సరం నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సెలవు కావడంతో స్నేహితులు, తన సోదరుడు యశ్వంత్‌తో కలిసి క్రికెట్ ఆడటానికి ఘట్టుపల్లిలోని కెసిఆర్ క్రికెట్ స్టేడియానికి వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా వెన్నునొప్పి రావడంతో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి కారులో కూర్చున్నాడు. యశ్వంత్ కారు వద్దకు వెళ్లి మణికంఠను పిలిచిన పలకకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. మణికంఠ గుండెపోటుతో చనిపోయి ఉంటాడని వైద్యులు తెలిపారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నర్సయ్య పేర్కొన్నారు.
Also Read: సన్‌రైజర్స్ రాత మారేనా?.. నేడు రాస్థాన్‌తో కీలక పోరు