Thursday, January 23, 2025

మంత్రి కెటిఆర్ విడుదల చేసిన “సాఫ్ట్ వేర్ బ్లూస్” ట్రైలర్

- Advertisement -
- Advertisement -

"Software Blues" trailer released by Minister KTR

 

శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్  నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను మంత్రి కే.టి ఆర్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24 న గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి. వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ఎలా ఉంటాయి అనే చక్కటి కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ట్విస్ట్స్, టర్న్స్ తో ఔట్ & ఔట్ ఫన్నీ కామెడీ ఎంటర్ టైన్ గా ఈ మూవీని రూపొందించడం జరిగింది. ఈ సినిమా చూసిన తరువాత సాఫ్ట్ వేర్ లో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా అని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీమియర్ చూసిన వారంతా ఇది హ్యాపీడేస్ మూవీలా ఉందని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇందులో పాటలు చాలా బాగున్నాయి. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను మంత్రి కె.టి.ఆర్ గారు విడుదల చేస్తూ సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అనడం మాకెంతో సంతోషం కలిగింది. “అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వి.కె రాజు మాట్లాడుతూ.. ఇటీవలే మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన మంత్రి కె.టి.ఆర్ గారికీ ధన్యవాదాలు. దర్శకుడు ఉమా శంకర్ చక్కటి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు. సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా “సాఫ్ట్ వేర్ బ్లూస్”. చాలా మంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ది  లగ్జరీ జీవితం అనుకుంటారు. చిత్ర దర్శకుడు  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా తను చేస్తున్న పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని తనకు సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో సాధారణ ప్రజలకు ఉన్నట్లే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కు కష్టాలు వుంటాయని ఫుల్  ఔట్ ఔట్ కామెడీ ఏంటర్ టైన్మెంట్ లో అందరికి అర్థమయ్యేలా ఈ మూవీ జేయడం జరిగింది. ఓటిటి లో ఆఫర్ వచ్చినా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని జూన్ 24 న విడుదల చేస్తున్నాము అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News