Tuesday, December 3, 2024

బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. ట్రైనింగ్ పేరుతో రూ.10 కోట్లు టోకరా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీ 100 ఫీట్ రోడ్ లో ‘ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ’ పేరుతో కంపెనీని కేటుగాళ్లు నిర్వహించారు. కన్సల్టేషన్ కంపెనీ దాదాపు 600 మందికి పైబడిన నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.1లక్ష, రూ.50,000 వేల చొప్పున వసూళ్లకు పాల్ప డింది. శిక్షణ ఇచ్చి జాబులు పేరిట సదరు కంపెనీ ప్రతినిధులు నమ్మించి మోసానికి తెగబడ్డారు.

శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ సైతం ఇప్పిస్తానంటూ నమ్మించి కుచ్చు టోపీ పెట్టారు. ఈ కంపెనీకి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, విజయవాడ కేంద్రాలుగా మరిన్ని బ్రాంచ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి సుమారు రూ.10 కోట్లు వసూళ్లు చేసిన సదరు కంపెనీ. ఉన్నపళంగా కార్యాలయానికి తాళం వేసింది. మెుత్తం రూ.10కోట్లు వసూలు కాగానే రాత్రికి రాత్రికి బోర్డు తిప్పేశారు. శనివారం ఉదయం ట్రైనింగ్ కోసం వెళ్లిన నిరుద్యోగులు తాళా లు వేసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మాదా పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గత కొంతకాలం నుంచి నిరుద్యోగులకు కంపెనీ శిక్షణ ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు. దీని నమ్మి చాలా మంది నిరుద్యోగులు మోసపోయారు. మేనేజర్, ఉన్నత స్థాయి ఉద్యోగులెవరూ కాంటా క్ట్‌లో లేరు. మా డబ్బులు తిరిగి ఇవ్వా లని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగులు, యజ మాని దొరికితేనే పూర్తి విష యాలు బయటకు వస్తాయని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీకి సంబం ధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేవని పోలీసులు పేర్కొన్నారు. యజమాని, మేనేజర్‌కు ఫోన్ చేస్తే సమాధానం లేదని అన్నారు. అయితే, అప్పుల తెచ్చి మరీ ఫీజులు చెల్లించామని, మంచి కంపెనీ ల్లో ప్లేస్మెంట్ ఇస్తామంటూ దారుణంగా మోసం చేశారంటూ బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News