- Advertisement -
హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మంటలు ఐదంతస్థులకు వ్యాపించడంతో ఐటి కంపెనీల ఉద్యోగులు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది రెండు యంత్రాలతో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -