Wednesday, January 22, 2025

వరల్డ్ కప్ లో ఓడిన భారత్… గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో క్రికెట్ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దుర్గ సుమద్రం గ్రామం జ్యోతి కుమార్ యాదవ్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోం చేయడంతో పాటు చిన్న చిన్న పనులకు కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తున్నాడు. జ్యోతి కుమార్ యాదవ్‌కు క్రికెట్ పై మక్కువ ఉండడంతో టిమిండియా మ్యాచ్ ఉంటే చాలు టివికి అతుక్కుపోతాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతుండడంతో తన స్నేహితులను ఇంటికి పిలిపించుకొని మ్యాచ్‌ను వీక్షిస్తున్నాడు. రాత్రి ఏడు గంటల సమయంలో మ్యాచ్ టెన్షన్ లో ఉండడంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News