Sunday, December 22, 2024

గచ్చిబౌలిలో డివైడర్ ఢీకొని సాఫ్ట్‌వేర్ మృతి

- Advertisement -
- Advertisement -

Software Death in Road accident at Gachibowli

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందాడు. గచ్చిబౌలిలోని కంపెనీలో పనిచేస్తున్న పొలిశెట్టి జయకృష్ణ(23)గా గుర్తించారు. ఇవాళ ఉదయం డివైడర్ ను ఢీకొని జయకృష్ణకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News