Monday, December 16, 2024

మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్‌ చేసి తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద సంఘటన మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నాగలక్ష్మి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి కొన్ని నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్‌తో వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగినట్లు సమాచారం.

ఈ క్రమంలో నాగాలక్ష్మీ ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్‌ చేసింది. బుధవారం విషం తాగి ఆత్మహత్య ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన ఇంటి యజమాని ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. దీంతో నాగలక్ష్మీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News