తిరువనంతపురం: ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బుర్ఖా ధరించి మహిళ బాత్రూమ్లోకి చొరబడి వీడియో రికార్డు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంఘటన కేరళలోని కోచ్చిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇన్ఫో పార్క్‌లో ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు బుర్ఖా ధరించి లూలూ మాల్లోని బాత్రూమ్లోకి ప్రవేశించాడు. ఓ కార్డు బాక్స్‌కు రంధ్రం చేసి ఫోన్ కెమెరా అన్ చేసి బయటకు వచ్చాడు. మెయిన్ డోర్ వద్ద ఉండి గమనిస్తుండడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నిచడంతో నిజాలు ఒప్పుకున్నాడు. ఫోన్‌తో పాటు బుర్ఖాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: ఎల్బి నగర్లో పంద్రాగస్టు రోజున మహిళపై థర్డ్ డిగ్రీ