Friday, December 20, 2024

రెండు నెలల్లో అమెరికాకు వెళ్లాల్సి ఉంది… ఇంతలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడపాల్సిన సమయంలో అనారోగ్య సమస్యలతో ఆమె తన ఇంట్లో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నారపునేనిపల్లిలో కిరణ్ కుమార్- ప్రసన్నలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కుమార్తె దావులూరి వర్షిత(24), ఎరుకుపాడు గామ్రానికి చెందిన యువకుడిని ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకుంది. పెళ్లైన వారం రోజులకే వరుడు ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాడు.

వర్షిత హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఆమె కూడా రెండు నెలల్లో అమెరికాకు వెళ్లాల్సి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో వర్షితను తండ్రి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున కూతురు కనిపించకపోవడంతో వెతికారు. ఇంటి ఆవరణంలో ఉన్న చేద బావిలో కూతురు శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అనారోగ్య సమస్యలతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News