Friday, December 20, 2024

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కూకట్‌పల్లికి చెందిన గుర్రం సురేందర్‌బాబు(35) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి నుంచి గురువారం ఉద్యోగానికి వచ్చిన సురేందర్‌ను రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని లుంబినీ పెట్రోల్ బంక్ ఎదుట కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు.

తర్వాత నిందితులు సురేందర్ భార్యు ఇంటర్‌నెట్ కాల్స్ చేసి రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. వెంటనే సురేందర్ భార్య రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. సురేందర్ మొబైల్ లొకేషన్ ఎపి రాష్ట్రంలో చూసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సురేందర్ ఆచూకీల తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆర్థిక వ్యవహారాలే కిడ్నాప్‌కు కారణమని తెలుస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News