Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

- Advertisement -
- Advertisement -

Software employee killed in road accident

హైదరాబాద్‌: నాగోల్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వినయ్‌ రెడ్డి (24)గా గుర్తించారు. అతడు సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడని తెలిపారు. కాగా, బైకును ఢీకొట్టి లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News