Friday, November 15, 2024

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సైబర్ నేరస్థుల చేతిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మోసపోయారు. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరిట సైబర్ నేరస్థులు డబ్బులు దోచుకున్నారు. ఓ ఉద్యోగి నుంచి రూ.4.2 లక్షలు, మరో ఉద్యోగి నుంచి రూ.1.3 లక్షలు సైబర్ నేరస్థులు దోపిడీ చేశారు. రోజు రోజుకు సైబర్ నేరాలు శృతిమించుతున్నాయి. ఫోన్ లో వచ్చిన లింక్స్ క్లిక్ చేసే చాలు ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. అకౌంట్ లో భారీ మొత్తంలో డబ్బులు ఉన్నవాళ్లు గూగుల్ ఫే, ఫోన్ పే, పే టిమ్ వాడకపోవడమే మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ డెస్క్ వంటి యాప్ లు ఇన్ స్టాల్ చేయడంతో ఫోన్ అనేది సైబర్ నేరస్థులు చేతిలోకి వెళ్లడంతో ఒటిపిల సహాయంతో పెద్దమొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నారు. అన్ని తెలిసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులను బొల్తా కొట్టిస్తే సాధారణ ఫౌరుల పరిస్థితి ఎంటి అని నెటిజన్లు వాపోతున్నారు. సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత అని సైబర్ నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News