Monday, January 20, 2025

సెలవు ఇవ్వడం లేదు.. ఈసీకి ఫిర్యాదు చేసిన సాప్ట్‌వేర్ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఎన్నికల సందర్భంగా తమకు గురువారం సెలవు ఇవ్వడం లేదని నగరంలోని పలు ఎంఎన్‌సి కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించి హెల్ప్‌లైన్ 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటేసేందుకు తమ కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదని వాపోతున్నారు. పని చేయాల్సిందే అంటూ ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం కావాలా ? ఓటు కావాలా అంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు వేసే విధంగా ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు పోలింగ్ రోజును సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు తమకు సెలవు ఇవ్వడం లేదంటూ ఉద్యోగు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. సెలవు ఇవ్వక పోతే ఓటు ఏలా వేయాలని ప్రవేట్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సీఈవో స్పందించించారు. ప్రైవేట్ సంస్థలు రేపు సెలవు ఇవ్వక పోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News