Thursday, January 23, 2025

శరద్ పవార్‌కు హత్య బెదిరింపు..సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పుణె :నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను హత్య చేస్తానని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపులపై ఆయన కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో వారు రంగం లోకి విచారణ చేపట్టారు. పుణెకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ చర్యకు పాల్పడినట్టు గుర్తించి సోమవారం అరెస్ట్ చేశారు.

నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టగా, 14 వరకు కోర్టు రిమాండ్ విధించింది. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర ధబల్కర్‌కు పట్టిన గతే శరద్ పవార్‌కు పడుతుందని రెండు రోజుల క్రితం ఆగంతకులు హెచ్చరించారు. 2013లో నరేంద్ర ధబోల్కర్‌ను ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. అదే విధంగా చంపుతామని బెదిరించడంతో పవార్ కుమార్తె పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News