Wednesday, January 22, 2025

బాలికపై అత్యాచారం చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Software engineer arrested for raping girl

హైదరాబాద్‌: బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని కృష్ణాజిల్లా, కనుమూరు గ్రామానికి చెందిన కందికొండ రవికుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఉంటూ సాఫ్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఇద్దరి ఇళ్లు పక్క పక్కన ఉండడంతో తరచూ మాట్లాడుకునేవారు. బాలికను ప్రేమిస్తున్నట్లు యువకుడు నమ్మించాడు. గతంలో బాలికను తీసుకుని వెళ్లగా స్థానిక పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి బాలికను కలవనని చెప్పాడు. తర్వాత బాలికను కుటుంబ సభ్యులు తమ బంధువులు ఉంటున్న హైదరాబాద్‌లోని మధురానగర్‌కి పంపించారు. ఇక్కడే బాలిక ఉంటూ 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే రవికుమార్ బాలిక ఉంటున్న చిరునామాను తెలుసుకుని మధురానగర్‌లోని తన రూముకు తీసుకుని వెళ్లి వివాహం చేసుకుంటానని బాలికను నమ్మించి లైంగికంగా కలిశాడు. ఈ విషయం బాలిక తన తల్లికి చెప్పడంతో ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు పెట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News