Monday, December 23, 2024

ఛీటింగ్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Software engineer arrested in cheating case

 

హైదరాబాద్ : ఆస్తులు లీజుకు ఇస్తామని చెప్పి ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి కారు, ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిసా రాష్ట్రం, రాయఘడ్‌కు చెందిన నగరంలోని కెపిహెచ్‌బిలో ఉంటున్న నెక్కంటి సుభాష్ నగరంలోని హెచ్‌సిఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. క్వికర్‌లో నకిలీ ప్రకటనలు ఇస్తున్నాడు. వాటి ద్వారా అడ్వాన్సుగా డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు. పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలోని శివసాయి సానిధి ఎన్‌క్లేవ్‌లో ఉన్న 2,400 స్క్వేర్ ఫీట్ల ఆఫీస్ స్పేస్‌ను లీజ్ లేదా రెంట్‌కు ఇస్తామని క్వికర్‌లో ప్రకటన ఇచ్చాడు.

దానిని చూసిన బాధితుడు నిందితుడు సుభాష్‌కు ఫోన్ చేశాడు. నెలకు రూ.35,000 అద్దె ఇవ్వాలని, ముందుగా అడ్వాన్స్ రూ.50,00 ఇవ్వాలని చెప్పాడు. ఇది నమ్మిన బాధితుడు సుభాష్‌తో రెంటల్ అగ్రిమెంట్ చేసుఉని డబ్బులు ఇచ్చాడు. తర్వాత అగ్రిమెంట్‌ను తీసుకుని వచ్చిన నిందితుడు వాటిని బాధితుడికి ఇచ్చాడు, దానిపై బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. నిందితుడు అసలు యజమానికి తెలియకుండానే అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బాధితుడు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఇలాగే చాలామంది బాధితులను అద్దె పేరుతో మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్, ఎస్సైలు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News