Sunday, December 22, 2024

రెండో రోజుల్లో పెళ్లి… కాలువలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం

- Advertisement -
- Advertisement -

వరంగల్: రెండో రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెళ్లి… కానీ సదరు యువకుడి మృతదేహం కాలువలో కనిపించిన సంఘటన హనుమకొండ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హనుమకొండ జిల్లాకు చెందిన భూక్య కృష్ణతేజ(29) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కృష్ణతేజకు నర్సంపేటకు చెందిన యువతితో పెళ్లి ఖరారు చేశారు. మార్చి 16న పెళ్లి చేయాలని ఇరువైపుల పెద్దమనుషులు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం పెళ్లి పత్రికలు బంధువులకు పంచి పెడుతానని ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. ఆదివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడికి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులకు పోన్ చేసినా సమాచారం లేకపోవడంతో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు అతడి కోసం వెతకగా పలివేల్పుల గ్రామ శివారులో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ దగ్గర బైక్‌ను గుర్తించారు. వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారులో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలో మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సమాచారం మేరకు కృష్ణతేజ తల్లిదండ్రులు తమ కుమారుడిదే మృతదేహం అని గుర్తించారు. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మృతుడి స్వస్థలం గోకుల్ నగర్ లో విషాదచాయలు అలుముకున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News