Thursday, January 23, 2025

పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్నాడు… టెకీ చనిపోయాడు…

- Advertisement -
- Advertisement -

చెన్నై: పరోటా, ఫ్రైడ్ రైస్ తిని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పాండిచ్చేరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అరియంపాళయానికి చెందిన సత్యమూర్తి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మార్చి 14న షాపింగ్ చేసిన అనంతరం అలసి పోవడంతో సుల్తాన్‌పేటలో ఓ హోటల్‌లో ఫ్రైడ్ రైస్, పరోటా తిన్నాడు. ఇంటికి వచ్చి రాత్రి పడుకున్నాడు. 15న మార్నింగ్ భర్తను భార్య సుకాంతి ఎంత పిలిచిన నిద్ర నుంచి లేవకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సత్యమూర్తి చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ హోటల్‌లో మాంసాహార, ఇతర భోజనాలు ఫేమస్ అని స్థానికులు చెబుతున్నారు. గతంలో హోటల్ పరిశుభ్రంగా ఉండకపోవడంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కేసులు నమోదు చేశారు. కానీ హోటల్ మాత్రం ఎప్పుడు కస్టమర్లతో కిటకిట లాడుతుందని స్థానికులు వాపోతున్నారు. సదరు సాఫ్ట్ వేర్ కు అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఆహారం విషమతుల్యం కావడంతో చనిపోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News