Tuesday, December 3, 2024

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్‌లు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసగా మారి అప్పులు ఎక్కువ కావడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలోని గంగాధర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధురానగర్‌లో నాగుల లక్ష్మణ్, లక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు తన కుమారుడు పృధ్వీని(25) బీటెక్ చదివించారు. ప్రస్తుతం పృధ్వీ హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మరో బ్రాంచ్ ఉత్తర ప్రదేశ్‌లో ఉండడంతో అక్కడికి అతడిని బదిలీ చేశారు. నోయిడాలోని సదరు కంపెనీలో జాబ్ చేస్తూ ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

ముగ్గురు స్నేహితులతో కలిసి గదిలో ఉండడంతో వారు ఆన్‌లైన్ గేములను పరిచయంతో చేయడంతో అతడు బానిసగా మారాడు. స్నేహితుల వద్ద రూ.12 లక్షలు అప్పులు చేసి ఆన్‌లైన్ గేములు ఆడడంతో డబ్బులన్నీ పొగొట్టుకున్నాడు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఏం చేయాలో తోచక ఎవరూ లేని సమయంలో అతడు గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని యుపి నుంచి కరీంనగర్‌కు తరలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News