Thursday, January 23, 2025

నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

- Advertisement -
- Advertisement -

నీటి సంపులో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…షేక్ అక్మల్ సుఫుయాన్(25) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి, అంజయ్య నగర్‌లోని పిజి హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం హాస్టల్ నుంచి బయటికి వస్తుండగా నీటి సంపు మూత తెరిచి ఉంది.

దానిని చూసుకోకుండా ముందుకు రావడంతో అందులో పడి మృతిచెందాడు. మృతుడికి ఈత రాకపోవడంతో అందులోనే మృతిచెందాడు. నిర్లక్షంగా సంపు మూత తెరచి ఉంచిన హాస్టల్ యజమాని మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేశామని రాయదుర్గం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News