Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన రామినేని మహేష్ బాబు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు.

రామచంద్రాపురంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో స్నేహితుడి వద్దకు వెళ్లి తీసుకుని వస్తానని స్కూటీపై బయటికి వెళ్లాడు. చందానగర్ మెయిన్ రోడ్డులో స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన డిసిఎం వ్యాన్ ఢీకొట్టడంతో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. డిసిఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్షంగా నడపడం వల్లే మహేష్ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News