Monday, December 23, 2024

అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమెరికాలో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్‌లో చిట్టోజు ప్రమీల, మదనాచారి అనే దంపతుల పెద్ద కుమారుడు గతంలో హైదరాబాద్‌లో ఉండేవాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసిన అనంతరం గత మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లాడు. జార్జియాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో మహేష్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి ఉద్యోగులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహేష్‌కు భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఐదు రోజుల సమయం పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News