Wednesday, March 12, 2025

ఉరి వేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….పిఎస్ పరిధిలోని కళ్యాణ్‌నగర్‌లో నివాసం ఉంటున్న అనంతకుమార్(44)కు భార్య, కూతురు ఉంది. రాత్రి బెడ్ రూమ్‌లో నిద్రపోయిన భర్తను ఎంతకూ లేవకపోవడంతో భార్య ఉదయం 11 గంటలకు బెడ్ రూమ్ డోర్ కొట్టింది. అనంతకుమార్ తీయకపోవడంతో కిటికీ ద్వారా లోపలికి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవగా వారు వచ్చి డోర్‌ను పగలగొట్టి అనంతకుమార్‌ను కిందికి దించారు. పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. విషయం పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ ఎస్సై స్వప్న రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News