Monday, December 23, 2024

ఆమె వాడై.. టెకీ యువతి ప్రాణాలు తీశాడు

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడులోని తళంబూరులో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన ఆర్ నందిని పైశాచిక హత్యకు గురైంది. నందిని జన్మదినం నాడే ఈ టేకీ కాళ్లు చేతులను గొలుసులతో కట్టిపడేసి , బ్లేడ్‌తో శరీరం కోసేసి, ఆమెను తగులబెట్టి చంపిందో నరరూప మృగం. నందిత పూర్వపు క్లాస్‌మెట్ అయిన వెట్రిమారన్ అలియాస్ పండి మహేశ్వరి ఈ దారుణానికి పాల్పడ్డారు. మారన్ అనబడే ఈ వ్యక్తి నిజానికి అమ్మాయి. అయితే నందినిని ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనే ఆరాటంతో చివరికి ఈ ఆడ లింగమార్పిడితో అబ్బాయి అయింది. ఈ 26 సంవత్సరాల వెట్రిమారన్ నందిత ఇంటికి వెళ్లి, పుట్టినరోజున ఏదో వింత పనిచేద్దామని మాయ మాటలకు దిగి ఆమె కళ్లకు గంతలు కట్టి , అత్యంత దారుణంగా హింసించాడు.

ఆమె కెవ్వుకేకలు పెడుతున్నా పట్టించుకోకుండా గొలుసులతో బంధించి వేసి, తరువాత పెట్రోలు పోసి తగులబెట్టాడు. పెళ్లి చేసుకునేందుకు మగాడిని అయ్యానని చెపుతూ చివరికి ఈ వ్యక్తి మృగం అయి ఈ యువతిని బలిగొన్నాడు. ఈ ఇద్దరు స్నేహితులు , కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు భయానకంగా ఆమెను అంతమొందించాడని చెన్నై శివార్లలోని తంబరం పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ తెలిపారు. దారుణరీతిలో చనిపోయిన యువతి మధురై వాసి. సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. కొంతకాలం చెన్నైలో బంధువుల ఇంట్లో ఉంది. నందిని ఇటీవలే ఇతరులతో చనువుగా తిరుగుతోందని గ్రహించి ఈ యువ పిశాచి ఈ దారుణానికి పాల్పడింది. అయితే చివరి వరకూ కూడా నందినికి ఎటువంటి అనుమానం తలెత్తకుండా హింసించి హింసించి చంపేసినట్లు వెల్లడైంది. మంటల్లో కాలిపోతూ చేతులకు కాళ్లకు గొలుసులతో ఉన్న ఈ యువతిని స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి చికిత్సకు పంపించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె కోసం తాను మగాడిని అయితే చివరికి మోసగించిందనే కోపంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News