Monday, January 20, 2025

బిల్డింగ్‌పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జీవితంలో అనుకున్న లక్షాలను సాధించలేకపోతున్నామని మనస్థాపం చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న సంఘటన టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శోభ కథనం ప్రకారం…గుడిమల్కాపూర్‌లోని బాలాజీనగర్‌లో ఇంటికి ఏడు నెలల క్రితం బ్లెస్సింగ్ టన్(26) అనే యువకుడు తన తల్లిదండ్రులు, సోదరుడితో పాటు అద్దెకు వచ్చాడు. బ్లెస్సింగ్ టన్ నగరంలోని టిసిఎస్ కంపెనీలో అసిస్టెంట్ సిస్టం ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యువకుడి తండ్రి కిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తల్లి, సొదరులతో కలిసి క్యారమ్ ఆడాడు. రాత్రి అందరూ కలిసి నిద్రపోయారు.

కాగా ఆదివారం ఉదయం 5 గంటలకు కిమ్స్ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి నన్ను క్షమించు అని అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తర్వాత బిల్డింగ్‌లోని మూడో అంతస్తు నుంచి దూకాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బ్లెస్సింగ్‌ను సమీపంలోని అలీవ్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శోభ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News