Saturday, November 23, 2024

బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

- Advertisement -
- Advertisement -

Software Job Racket Busted in Gachibowli

300 మందిని ముంచిన నిందితుడు… ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
ఒక్కొక్కరి వద్ద రూ.25వేలు వసూలు
గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

హైదరాబాద్: ఇటీవల ఇంజీనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. నిందితుడు విద్యార్థుల నుంచి రూ.75,00,000 వసూలు చేశాడు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన అరిటాకుల నాగసత్య రవితేజ కొండాపూర్ ఎక్స్ రోడ్డులో వి వర్క్ క్రిష్ ఏనారల్ సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన విద్యార్థులు 300 మంది రూ.25,000 చొప్పున కట్టి చేరారు.

ఇందులో చేరిన వారికి మూడు నెలలు శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా వారికి సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్‌లు ఇచ్చాడు. సంస్థలో చేరి మూడు నెలలు అవుతున్నా నిందితుడు వారికి జీతాలు ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు తమకు జీతాలు ఇవ్వాల్సిందిగా నిలదీశారు. నాగాసత్య రవితేజ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు. నిందితుడు మాదాపూర్‌లో సంస్థను నడిపిస్తూ గచ్చిబౌలిలో ఫేక్ అడ్రస్ ఇచ్చాడు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News