Monday, March 31, 2025

ఎల్‌ఆర్‌ఎస్‌కు సాఫ్ట్‌వేర్ సమస్యలు

- Advertisement -
- Advertisement -

గజాల్లో ప్లాట్లు…కోట్లలో ఫీజులు
ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు
ఎల్‌ఆర్‌ఎస్ గడువును పెంచాలని
ప్రభుత్వానికి వినతులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు తలెత్తుతుండడంతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై పలు జిల్లాల నుంచి ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఈ సాఫ్ట్‌వేర్ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టుగా తెలిసింది.దీంతోపాటు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల చెల్లింపులో కూడా భారీగా వ్యత్యాసా లు వస్తున్నాయని, దీంతోపాటు ప్లాట్ల వెరిఫేకషన్ పే రుతో కొందరు మున్సిపల్ సిబ్బంది డబ్బులు డి మాండ్ చేస్తున్నారని పురపాలక శాఖకు ఫిర్యాదు లు అందినట్టుగా తెలిసింది. ఈ సమస్యలతో పా టు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి లో చాలామందికి ఇప్పటివరకు ఎలాంటి మేసెజ్ లు రాలేదని, కనీసం దాని గురించి తెలుసుకోవడానికి వెళ్లినా మున్సిపల్ ఆఫీసుల్లో ఎలాంటి స మాచారం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈనెల 31వ తేదీతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రా యితీ గడువు ముగుస్తుండడంతో దీనిని పొడిగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ సమస్యలతో ఫీజులు చెల్లించలేని వారి పరిస్థితి ఏమిటన్నది ఇంకా ఆగమ్యగోచరంగా మారింది.

దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వే చి చూడాల్సిందే. ముఖ్యంగా వెంచర్‌లలో పక్కపక్కన ప్లాట్లకు ఫీజు చెల్లింపుల్లో భారీగా తేడాలు వ స్తున్నాయని, దీనివల్ల లక్ష నుంచి కోట్ల రూపాయాల ఫీజును చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంటున్నారని, ఇలా అయితే తాము ఎలా ఫీజును చెల్లిస్తామని ఆయా ప్లాట్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది సాఫ్ట్‌వేర్ సమస్య అని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారని, ఇప్పటికే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అధికారులు పేర్కొంటుండడం విశేషం. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు ఆటోమెటిక్‌గా సాఫ్ట్‌వేర్ ఫీజును ఖరారు చేస్తుందని, అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువ ఫీజు చెల్లించాలని మున్సిపల్ శాఖ ఇచ్చిన నోటీసులపై బాధితులు గ్రీవెన్స్‌సెల్‌కు కాల్ చేస్తే ఆ నంబర్ పనిచేయడం లేదని బాధితులు వాపోతున్నారు. దీంతో కొందరు నేరుగా ఆయా మున్సిపాలిటీల్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తుండడం విశేషం.

పక్కపక్కన ప్లాట్లకు భారీ వ్యత్యాసం
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సర్వే నంబరు 108లో కిష్టారెడ్డినగర్‌కు చెందిన 337 గజాల ఇంటి స్థలం రెగ్యులరైజ్ చేసుకోవడానికి 2020 అక్టోబర్‌లో పద్మ అనే మహిళ ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లాటు రెగ్యులైజేషన్‌కు ఫీజు చెల్లించేందుకు పురపాలక శాఖ అధికారుల ద్వారా ఆమెకు ఓ లేఖ అందింది. అందులో ఏకంగా రూ.27,33,42,786 రెగ్యులరైజ్ ఛార్జీలు చెల్లించాలని ఆ నోటీసుల్లో సూచించారు. దీంతోపాటు సంగారెడ్డి జిల్లా కంది మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పక్కపక్కనే ప్లాట్లు ఉన్నా, సర్వే నంబర్లు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ఒక ప్లాట్‌కు చదరపు గజానికి రూ.300లు ఉండగా, పక్కనే ఉన్న మరో ప్లాటు చదరపు గజం ధర ఏకంగా రూ.15 వేలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొనడంతో ఆ ప్లాట్ల యజమానులు దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇక, యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామచంద్రాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 22లో ఉన్న 1073 గజాల ప్లాట్‌కు రూ.4,57,38,873లు చెల్లించాలని అధికారులు నోటీసులు పంపించారు. ఇంత పెద్దమొత్తంలో తేడా చూపిస్తుండటంతో చాలా మంది క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదని సమాచారం.

1,331 గజాలకు రూ.28 కోట్లు
వీటితో పాటు మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో 1,331 గజాల ఇంటి స్థలాన్ని ఓ మహిళ కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీం కింద భూక్రమబద్ధీకరణ కోసం 2020 సంవత్సరంలో ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుగా రూ. 28,94,48,603 చెల్లించాలని ఇటీవల నోటీసు రావడంతో ఆమె కంగుతిన్నారు. అదే సర్వేనంబర్‌లో పక్కనే మరొకరికి రూ.14 లక్షల విలువైన 380 గజాల ప్లాట్ ఉంది. ఎల్‌ఆర్‌ఎస్కు దరఖాస్తు చేసుకోగా, రూ.5 కోట్లు ఫీజు చెల్లించాలని మున్సిపాలిటీ నుంచి నోటీసు అందింది. దీంతోపాటు వరంగల్ పరిధిలో ఓ వ్యక్తి ఒకే సర్వే నంబర్‌లో 548 గజాల చొప్పున మూడు ప్లాట్లను కొనుగోలు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా,

ఒక ప్లాట్‌కు రూ.90 వేలు, రెండో ప్లాట్‌కు రూ.98 వేలు, మూడో ప్లాట్‌కు రూ.2 లక్షలు ఫీజు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. ఒకే సర్వేనంబర్, ఒకే లే ఔట్, ఒకే విస్తీర్ణం గల ప్లాట్లకు వేర్వేరు ఫీజు రావడంపై ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కరీంనగర్ శివారు అలుగునూరులో ఓ వ్యక్తి ఒకే సర్వేనంబర్‌లో 183 గజాల చొప్పున మూడు ప్లాట్లను కొనుగోలు చేశారు. ఒకేరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను దరఖాస్తు చేసుకోగా, గజానికి సుమారు రూ.380ల చొప్పున రూ.67 వేలు చెల్లించాలని మొదటి ప్లాట్‌కు నోటీసు అందింది. ఆ మొత్తం ఇంటి యజమాని చెల్లించారు. తర్వాత అంతే విస్తీర్ణంలో మరోప్లాట్‌కు గజానికి రూ.205 చొప్పన రూ.37 వేలు చెల్లించాలని నోటీసు అందింది. మొదటి ప్లాట్‌కు ఎక్కువ ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినట్టు గుర్తించిన యజమాని, అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అధికారులను కోరడం విశేషం.

కొన్ని ప్లాట్లకు 2023 ధరల ప్రకారం ఫీజు చెల్లించాలని
ఇక, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని మున్సిపాలిటీల్లో సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఒకే లే- ఔట్‌లోని కొన్ని ప్లాట్లకు 2020లో రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం ఫీజును చెల్లించాల్సి ఉండగా, మరికొన్ని ప్లాట్లకు మాత్రం 2023 ధరల ప్రకారం చెల్లించాలంటూ భూ యజమానులకు నోటీసులు వచ్చాయి. మూడేళ్ల వ్యవధిలో మూడింతల మేర రుసుం చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొనడంతో దరఖాస్తుదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సమస్యలు ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఆదిభట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ మున్సిపాలిటీ, మేడ్చల్ జిల్లా ఘటేకేసర్, పోచారం, తూంకుంట, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో ఎదురవుతున్నాయని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News