Tuesday, September 17, 2024

మంత్రి తుమ్మల పిలుపు.. మున్నేరు బాధితులకు అండగా సాఫ్ట్‌వేర్ రంగం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో సర్వం కోల్పొయిన మున్నేరు వరదభాధితులకు ఆదుకోవాని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ణప్తికి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్ ప్రైజెస్ ఆసోసియేషన్ స్పందించింది. ఐ.టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లు అందజేసింది. వీటివిలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజేస్ అసోసియేషన్ వెల్లడించింది. రూ. 3 కోట్లు వ్యయం చేసి మొత్తం 10,000 కిట్లు అందజేసింది.

గత వారం కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు పొంగి ఖమ్మం పట్టణంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేస్తు వారి మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు.

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు, ఐ.టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజేస్ అసోసియేషన్ వారు ఖమ్మం మున్నేరు వరద బాధితుల కోసం తమ సంస్థ తరపున నిత్యవసర కిట్లు అందచేయడం జరిగింది. రూ. 3000 విలువ చేసే ఈ కిట్లలో ప్రజలకు కావాల్సిన బియ్యం, పప్పులు, నూనే ప్యాకేట్లు, చక్కెర, ఉప్పు, కారం లాంటి నిత్యవసర సరుకులతో పాటు టవల్స్ కూడా కిట్లలో పెట్టి పంపించింది. మొత్తం 3 కోట్ల రూపాయలతో 10,000 కిట్లను ఈ రోజు సెక్రటేరియేట్ ప్రాంగణం నుంచి ఖమ్మంకి వాహనాలు బయలుదేరాయి.

ఖమ్మంకు చేరిన వెంటనే ఈ కిట్లను వరద భాదితులకు సక్రమంగా అందేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్ట సమయంలో మంత్రి శ్రీధర్ బాబు చొరవతో కిట్లు సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన హెచ్‌వైఎస్‌ఇఏ ప్రతినిధులకు ప్రభుత్వం తరపున, ఖమ్మం ప్రజల తరపున ధన్యావాదాలు తెలియజేశారు. ఈ ఆపత్కాలంలో మరిన్ని ప్రైవేట్ సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవడములో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News