Friday, November 22, 2024

మంత్రి మల్లారెడ్డికి ఊరట

- Advertisement -
- Advertisement -

అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మ ల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై పిటిషన్ దాఖలు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ తరఫున మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో మల్లారెడ్డి తాను అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు, గతంలో రెండు ఎన్నికలలో పేర్కొన్న అంశాలతో ఏ విధంగానూ మ్యాచ్ కాకపోవడంతో ఆయన అఫిడవిట్ ను సవాల్ చేస్తూ అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ప్యాట్నీలోని ప్రభుత్వ కాలేజీలో 1973వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివినట్టు పేర్కొన్నారు. ఇక 2018 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో సికింద్రాబాద్‌లోని వెస్లీ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం 2023 మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌లో ఆయన రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారని ఆయన ఇంటర్ చదువు విషయంలో ఏది కరెక్ట్ అన్నారు.

2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి వయసు 56 సంవత్సరాలని ఇచ్చారని, ఇప్పుడు వయసు 70 సంవత్సరాలు అని ఇచ్చారన్నారు. 2014 నుండి 2023 వరకు 9 సంవత్సరాలే అవుతుందని, అలాంటప్పుడు మంత్రి మల్లారెడ్డి వ యసు 70 సంవత్సరాలు ఎలా ఉంటుందని ప్రశ్నించా రు. ఇక ఆస్తుల వివరాల్లో కూడా మంత్రి మల్లారెడ్డి అన్ని తప్పులే ఇచ్చారని ఆయన నామినేషన్ను తిరస్కరించడానికి ఈ ఆధారాలు చాలని పేర్కొన్నారు. ఈ మూడు అఫిడవిట్‌లపై రాంపల్లి దాయార గ్రామవాసి కందాడి అంజిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని అంజిరెడ్డి కోర్టు మెట్లెక్కారు. ఆయన నామినేషన్ తిరస్కరించేలా ఆదేశాలు జారీ చెయ్యాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఫిర్యాదుదారుడికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానం ఇచ్చినట్టు ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పటంతో ఈ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News