Sunday, December 22, 2024

సూర్యాగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

- Advertisement -
- Advertisement -

Solar Eclipse: Tirumala Temple closed for 12 hrs

తిరుమల: సూర్యాగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడింది. మంగళవారం ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు 12 గంటల పాటు టిటిడి అధికారులు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదానం, లడ్డూ కాంప్లెక్స్ మూసివేసినట్లు తెలిపారు. సూర్యాగ్రహణంతో 18 గంటల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు రద్దు చేశామని.. పుణ్యహవచనం, ఆలయ శుద్ధి తర్వాత రాత్రి 9గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనుున్నట్లు పేర్కొన్నారు. కాగా, సోమవారం శ్రీవారిని 69,278మంది భక్తులు దర్శించుకున్నారు. 17,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Solar Eclipse: Tirumala Temple closed for 12 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News