Tuesday, March 11, 2025

పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్

- Advertisement -
- Advertisement -

అడవి జంతువులు, కోతుల నుండి
రక్షణకు చర్యలు కొత్త పథకం
ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
జూన్ మొదటివారంలోగా
అందుబాటులోకి మరో ఆయిల్‌పామ్
ఫ్యాక్టరీ: మంత్రి తుమ్మల
మన తెలంగాణ / హైదరాబాద్ : అడవి జం తువులు, కోతుల నుండి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ పథకం ప్రారంభించే యోచనలో ఉ న్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పామాయిల్ తో పా టు ఇతర పంటలకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను రైతులకు అందించాలని కోరారు. – రాష్ట్ర అవసరాలు తీర్చేలా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చే యాలని సూచించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉద్యానశాఖ అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం ని ర్వహించినారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ కోతులు, ఇతర అడవి జంతువుల వల్ల ఇబ్బంది ఉన్న అన్ని జిల్లాల్లో ఉద్యాన పం టల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చే సేందుకు వీలుగా

సోలార్ ఫెన్సింగ్ స్కీం అమలవుతున్న హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీపై అందించేలా విధివిధానాలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల కూరగాయలు, ఉద్యాన పంటల సాగు చేయడానికి రైతులు ముందుకు రావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న అన్ని ప్రాంతాలలో కూరగాయాల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో కూరగాయల పంటలను పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసి, కూరగాయలను దిగుమతి చేసుకొనే స్థితి నుండి ఎగుమతి చేసే స్థితికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం సంబంధించి కూడా ముందస్తుగా డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ కోసం ధరఖాస్తులను స్వీకరించి, గ్రౌండింగ్ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో సాగు చేస్తూ లాభాలు పొందుతున్న మెకడమియా పంటను రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి గల వాతావరణ స్థితిగతులు, నేలలు, నర్సరీలు, మార్కెటింగ్ అవకాశాలను అధ్యయనం చేయాలని ఉద్యానశాఖ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలి : మార్చి నెలాఖరు కల్లా ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, తక్కువ పురోగతి ఉన్న కంపెనీలకు నోటిసులు జారీ చేసి, ఏఏ జిల్లాలలో తక్కువ పురోగతి ఉందో వాటికి అనుమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆయిల్ పామ్ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి మల్టి నేషనల్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీకి సదరు ప్రాంతాన్ని అప్పగించడం జరిగిందని, అలాగే ఇంకా ఎక్కడైతే కంపెనీలు మూడు, నాలుగు సంవత్సరాలు అయినా ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి భూమి గుర్తించక పోవడం, ప్లాంటేషన్ లక్ష్యాన్ని చేరుకోని కంపెనీలను తొలగించి, వాటి స్థానంలో ఆయిల్ ఫెడ్ కు బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయిల్ పామ్ సాగు కోసం రెండు లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు.

ఆయిల్ ఫెడ్ సిబ్బందికి క్ష్యాలు నిర్ధేశించాలి : ఆయిల్ ఫెడ్ సిబ్బందికి కూడా లక్ష్యాలు నిర్ధేశించి వాటిని చేరుకునేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రైవేట్ కంపెనీలు కూడా లక్ష్యానికి అనుగుణంగా ప్లాంటేషన్ పూర్తి చేసేట్టుగా, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పర్యవేక్షణ చేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్‌కి సూచించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ఉమ్మడి జిల్లాలలో కనీసం ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేలా చూడాలని, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కనీసం సంబంధింత జిల్లాలలో 6 వేల ఎకరాలకు పైన ప్లాంటేషన్ ఉండేట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఆయిల్ పామ్ కర్మాగారాన్ని మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, గద్వాల జిల్లా బీచుపల్లిలో, ఖమ్మం జిల్లా కల్లూరిగూడంలో ఆయిల్ పామ్ కర్మాగారాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి పనులు ప్రారంభించి డిసెంబర్ కల్లా వాటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. 6 వేల ఎకరాలపైన ప్లాంటేషన్ పూర్తి చేసిన ప్రైవేట్ కంపెనీలు కూడా వెంటనే పామ్ ఆయిల్ కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News