Friday, December 20, 2024

ఊటవాగు గూడెంకి సోలార్ వెలుగులు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : కారేపల్లి మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామానికీ 5 కిమీ దూరములో అడవిలో గత 15 ఏళ్ల క్రితం వలస ఆదివాసీ గుత్తి కోయలు 26 గుడిసెలతో ఊటవాగు గూడాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భౌగోళికంగా కామేపల్లి మండలమైనప్పటికీ వీరికి నిత్యావసరాలు, ఉపాధి కోసం ఆ గూడానికి కాలి బాట కుడా ఎర్రబోడు గ్రామంనుండే వలస ఆదివాసీలు కావడం, అడవిలో గ్రామము ఉండటంతొ విద్యుత్ సౌకర్యం కుడా లేదు.

ఈ గూడానికి విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతుండటంతో కారేపల్లి ఎస్‌ఐ పుష్పాల రామారావు ఈ గూడేనికి సోలార్ వీధిదీపాలు ఏర్పటు చేయాలనీ సింగరేణి సంస్త దృష్టికి తీసుకుపోవడముతో ఇల్లందు సింగరేణి సంస్త జనరల్ మేనేజర్ ఎం.షలేము రాజుకు విఙ్ఞప్తి చెయ్యగా స్పందించి (సిఎస్‌ఆర్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 80 వేలు వెచ్చించి మూడు సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేయడముతో ఆ గూడానికి వెలుగులు వచ్చాయి.

దాదాపు 15 ఏళ్ల తర్వాత వారి గ్రామం ఏర్పడ్డాక మొదటిసారిగా సోలార్ వెలుగులు రావడంతో 150 మంది జనాభా ఉన్న గుత్తి కోయ తెగకు చెందిన వలస ఆదివాసి గుడెంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా వారు సింగరేణి ఇల్లందు ఏరియా జనరల్ మేనెజర్ శాలేం రాజుకు, సమస్యను సింగరేణి సంస్త దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో వీధిదీపాల ఏర్పాటుకు కృషి చేసిన సింగరేణి మండల పోలీస్ అధికారి పుష్పాల రామారావు కు వలస ఆదివాసి ప్రజలు కృతజ్ఞ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News