Sunday, January 12, 2025

పోడు సాగుకు సోలార్ పవర్

- Advertisement -
- Advertisement -

గిరిజనశాఖకు ఆదేశాలు జారీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణిని కొనసాగిస్తాం
ప్రజలకు జవాబుదారీగా పని చేస్తాం
బిఆర్‌ఎస్ సర్కార్ ఏనాడూ పోడు రైతులను
పట్టించుకోలేదు ప్రజావాణిపై నిర్వహించిన
కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి

అటవీ చట్టం ద్వారా పట్టాలు పొందిన పోడు రైతులు సాగు చేసుకోవడానికి సోలార్ ద్వారా ప్రతి వ్యవసాయం పంపు సెట్ కు కరెంటు అందించడానికి చర్యలు తీసుకుంటాం. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖకు త్వరలో ఆదేశాలు ఇస్తాం. ప్రజల అవసరాలు వారి ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణిని ఏర్పాటు చేసింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తాం

ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా పట్టాలు పొందిన పోడు రైతులు సాగు చేసుకోవడానికి సోలార్ ద్వారా ప్రతి వ్యవసాయం పంపు సెట్ కు కరెంటు అందించడానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోడు రైతులు సోలార్ పవర్ పెట్టుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజల అవసరాలు వారి ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణిని ఏర్పాటు చేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని వెల్లడించారు. ఏడాది పూర్తి చేసుకున్న ప్రజా ప్రభుత్వంలో నిర్వహించిన ప్రజావాణిలో పెట్టుకున్న దరఖాస్తులకు పరిష్కారం లభించిందని లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం మహాత్మా జ్యోతిభా ఫూలే భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రజావాణి కార్యక్రమ లబ్దిదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం పనిచేస్తున్నదని ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులకు ఆ దరఖాస్తులను పంపించి, ఆ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారి తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చెప్పే విధంగా నిరంతరాయంగా పర్యవేక్షణ చేయడంవల్ల దరఖాస్తుదారులు సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారని వివరించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ప్రజల కోసమే పని చేస్తూ ప్రజాస్వామ్యానికి పునాదులు వేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలనే రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రియాంబుల్స్, చట్టాలను తూచా తప్పకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యతతో ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి అవసరాలు తీర్చడం కోసం తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చకపోగా 70 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు.

భావ స్వేచ్ఛ, ప్రగతిశీల ఆలోచనలకు స్థానం లేకుండా గుప్పిట్లో బంధించి పాలన అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కడమే కాకుండా పోడు రైతుల సమస్యలను గత బిఆర్‌ఎస్ పాలకులు పట్టించుకోలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మన ఆశలు ఆకాంక్షలు నెరవేరవని భావించి అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక వైపు భారీ బహిరంగ సభలు నిర్వహించగా, సిఎల్పీ నాయకుడిగా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లామన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని మన సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజలకు చెప్పడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News