Monday, December 23, 2024

సర్కారీ స్కూళ్లకు సౌర విద్యుత్ వెలుగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సోలార్ విద్యుత్‌తో ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ భారం సగానికి పైగా తగ్గుతోందని రెడ్కో ఛైర్మెన్ వై. సతీష్ రెడ్డి అన్నారు. మన ఊరు మన బస్తీలో భాగంగా రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానళ్లను మీర్‌పేట్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డితో కలిసి సతీష్ రెడ్డి పరిశీలించారు. సోలార్ ప్యానళ్ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇలాగే ఇంధన పరిరక్షణలో భాగంగా క్లాస్ రూముల్లో రెడ్కో సంస్థ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి లైట్లు, బిఎల్‌డిసి ఫ్యాన్లను ఆయన పరిశీలించారు.

వాటి పనితీరు గురించి పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎల్‌ఈడి లైట్లు బిఎల్‌డిసి ఫ్యాన్లు ఏర్పాటు చేసిన తర్వాత విద్యుత్ బిల్లు సగానికి పైగా తగ్గిందని స్కూల్ సిబ్బంది చెప్పారు. ఇవి తమకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా రెడ్కో ఛైర్మెన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యావ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మన ఊరు మన బడి , మన ఊరు మన బస్తీతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని సతీష్ రెడ్డి అన్నారు. జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాల అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు.

కార్పొరేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు వసతులు మెరుగుపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, డిఎం రవీందర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News